Sanju Samson: జింబాబ్వే టూర్‌కు ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే, సంజూను జట్టు నుంచి తప్పించలేదని, ఇదంతా పక్కా స్ట్రాటజీలో భాగంగా అతనికి ఇచ్చిన రెస్ట్ మాత్రమేనని క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంజూను పక్కన పెట్టడం వెనక ఉన్న అసలు కారణాలను వెల్లడించింది.
ఆసియా క్రీడల కోసమే ఈ ప్లాన్:
సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా క్రీడల భారత జట్టులో సంజు శాంసన్ సభ్యుడిగా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్ చిన్నది కావడం, పైగా అక్కడ అతనికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రాకపోవచ్చనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక సీనియర్ ప్లేయర్‌ను మ్యాచ్‌లు ఆడించకుండా కేవలం బెంచ్‌పై కూర్చోబెట్టడం కంటే అతనికి రెస్ట్ ఇచ్చి యువ ఆటగాళ్లను పరీక్షించడం మంచిదని సెలక్షన్ కమిటీ భావించింది.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వడం కోసం!
ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు ఈ సిరీస్ ద్వారా తగినన్ని అవకాశాలు ఇవ్వాలని భారత సెలెక్టర్లు నిర్ణయించారు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 168.87 స్ట్రైక్ రేట్‌తో 510 రన్స్ చేసి ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు ఎంపికైన టాప్ ఆర్డర్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్.. వీరంతా ఎడమచేతి వాటం (Left-handed) బ్యాటర్లే.. కాబట్టి టాప్ ఆర్డర్‌లో ఒక సాలిడ్ రైడ్ హ్యాండ్ (Right-handed) బ్యాటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభ్‌సిమ్రాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
సుంజూ ఫామ్‌లో లేకపోవడం కూడా ఒక కారణమే:
సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడానికి అతని ఫామ్ లేమి ప్రధాన కారణం కాదని బీసీసీఐ రిపోర్ట్ చెబుతున్నప్పటికీ, ఇటీవల అతను వరుసగా విఫలం కావడం కూడా మైనస్ అయింది. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు కొట్టినప్పటికీ, కొన్ని మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఐర్లాండ్ సిరీస్‌లో 0, 5 రన్స్.. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో కేవలం 1 రన్ మాత్రమే చేశాడు. ఈ మూడు మ్యాచుల్లో వైఫల్యాల వల్లే రెండో టీ20లో అతని స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ ఛాన్స్ ఇచ్చారు.
