గర్భిణీల నుంచి పిల్లలు ఆరేళ్లు వచ్చే వరకు న్యూట్రీషన్ ఫుడ్. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ , లంచ్

గర్భిణీల నుంచి పిల్లలు ఆరేళ్లు వచ్చే వరకు న్యూట్రీషన్ ఫుడ్. నర్సరీ నుంచి ఇంటర్ వరకు  ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ , లంచ్

తెలంగాణ సమాజ అభివృద్ధిలో మహిళలు, పిల్లల పాత్రే అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గర్భిణీల నుంచి పిల్లలకు 6 ఏళ్లు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనే టీచర్లు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయాలని సీఎం నిర్ణయించారు.

పిల్లలకు ఓట్లు లేకపోయినా.. వారి భవిష్యత్ పట్ల తమ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల సంక్షేమంపై మాట్లాడుతూ.. ప్రజా పాలన వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని, దీనివల్ల పనిచేసే మహిళలకు నెలకు 10 వేల వరకు ఆదా అవుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తున్నామని.. త్వరలోనే హైదరాబాద్ సిటీలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు పంచుతామని సీఎం భరోసా ఇచ్చారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.