ఆదిలాబాద్ లో దారుణం... టిఫిన్ తిందామని హోటల్ కి వెళ్తే.. సాంబార్ లో బల్లి..

ఆదిలాబాద్ లో దారుణం... టిఫిన్ తిందామని హోటల్ కి వెళ్తే.. సాంబార్ లో బల్లి..

ఈ మధ్య హోటల్ తిండి తినాలంటేనే భయం వేస్తోంది. హోటళ్లలో జరుగుతున్నా తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు, బడా హోటళ్లలో సైతం కిచెన్ లో ఎలుకలు తిరగడం, ఏ మాత్రం పరిశుభ్రత లేకపోవడం వంటి ఘటనలు ఒక పక్క... బిర్యానీలో బల్లి, కుళ్ళిన చికెన్ వంటివి కనిపించిన ఘటనలు వెరసి జనం హోటల్ ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ లో మరో దారుణం జరిగింది. టిఫిన్ తిందామని హోటల్ కి వెళ్లిన కస్టమర్ సాంబార్ లో బల్లి చూసి అవాక్కయ్యాడు. మంగళవారం ( జులై 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కు టిఫిన్ తినేందుకు వెళ్ళాడు ఓ కస్టమర్. సాంబార్ లో బల్లి ప్రత్యక్షమవ్వడంతో అవాక్కయ్యాడు కస్టమర్. హొటెల్ నిర్వాహకుడికి విషయం చెప్పగా.. అతనికి క్షమాపణ చెప్పాడు. అంతటితో ఆగకుండా... ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు కస్టమర్.

కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ కు చేరుకొని పరిస్థితి పరిశీలించారు అధికారులు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.