సింగరేణి బ్లాక్ లను తెలంగాణకే కేటాయించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి బ్లాక్ లను తెలంగాణకే కేటాయించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి బ్లాక్ లను తెలంగాణకే కేటాయించాలని కిషన్ రెడ్డి కోరుతున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి తాడిచెర్ల 2 బ్లాక్ ను అలాట్ చేశాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని... సింగరేణికి క్లియరెన్స్ అని కిషన్ రెడ్డి చెప్పడం చాలాసంతోషమని అన్నారు. తాడిచెర్ల 2 బ్లాక్ ను 2013 లోనే యూపీఏ గవర్నమెంట్ అలాట్ చేసిందని... ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ ను అలాట్ చేసింది ఏంటని ప్రశ్నించారు భట్టి.

సర్వే, డ్రిల్లింగ్, అన్ని చెక్ చేసుకొని సింగరేణి మైనింగ్ లీజు కోసం 2023 దరఖాస్తు చేసిందని... ఆనాటి నుంచి పెండింగ్ లో పెట్టుకొని కేంద్రం ఇప్పుడు లీజుకు అనుమతిని ఇచ్చిందని అన్నారు. సీఎం రేవంత్, తాను దిన్ని ఆపద్దు అని కేంద్రాన్ని కోరామని.. అయినప్పటికీ ఆపి, ఆపి ఇప్పుడు లీజుకు అనుమతిని ఇచ్చిందని అన్నారు భట్టి.

కేంద్రానికి తాను గతంలోనే లేఖ రాసానని... తెలంగాణలో సింగరేణి గుర్తించిన మైన్స్, బ్లాక్స్ ను ఇవ్వాలని మేము కోరామని అన్నారు. ఇది ట్రైబల్ ల్యాండ్ అని కేంద్రానికి చెప్పామని... ట్రైబల్ ల్యాండ్ లను వాళ్లు వాడుకోవాలని.. లేదంటే ప్రభుత్వానికి వాడుకునేందుకు ఇవ్వాలని అన్నారు. కాల్ బ్లాక్ కేటాయించామని చెప్పడం ఆక్షేపణీయమని... కోయగూడం బ్లాక్ 2, సత్తుపల్లి బ్లాక్ 2 ను ఆక్షన్ చేయడం తప్పుని అన్నారు భట్టి.ఆక్షన్ ద్వారా ప్రైవేట్ కు సింగరేణి బ్లాక్ లు కట్టబెట్టాలనీ చూడటం ఆక్షేపనీయమని అన్నారు భట్టి.