అక్కాచెల్లెళ్లను మోసం చేసిన మహేష్ బాబు.. క్రేజీ సీక్రెట్ బయటపెట్టిన మరదలు శిల్పా!

 అక్కాచెల్లెళ్లను మోసం చేసిన మహేష్ బాబు..  క్రేజీ సీక్రెట్ బయటపెట్టిన మరదలు శిల్పా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత కూల్ గా, సైలెంట్ గా కనిపిస్తారో అందరికి తెలిసిందే. కానీ ఆయన సెన్స్ ఆప్ హ్యూమర్ మాత్రం చాలా షార్ప్. లేటెస్ట్ గా మహేష్ బాబు మరదలు, బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ ఒక క్రేజీ సిక్రెట్ ను బయటపెట్టింది. ఈ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ గా మారింది. 

ఇటీవల ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పా శిరోద్కర్.. మహేష్, నమ్రత పెళ్లైన కొత్త రోజులను గుర్తు చేసుకున్నారు. నమ్రత, శిల్పా ఇద్దరి మాతృభాష మరాఠీ కావడంతో.. మహేష్‌కు ఆ భాష రాదని భావించారు. దీంతో ఆయన ముందే వ్యక్తిగత విషయాలు, కుటుంబ రహస్యాలు అన్నీ మరాఠీలో మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. మహేష్ మాత్రం  అమాయకంగా ఏమీ అర్థం కానట్టుగా  సైలెంట్ గా వింటూ కూర్చునేవారు. అందుకే ఆయనపై తమకు ఎలాంటి అనుమానం రాలేదని ఆమె తెలిపారు.

అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు నమ్రత తో నేను  మరాఠీలో మాట్లాడుకుంటుండగా మహేష్ ఒక్కసారిగా మరాఠీలోనే అవునా... నిజమా? అంటూ స్పందించారని శిల్పా నవ్వుతూ చెప్పారు. ఆ మాట విన్న వెంటనే తాము ఇద్దరం షాక్‌కు గురయ్యామని, అప్పుడే ఆయనకు మరాఠీ పూర్తిగా అర్థమవుతుందని తెలిసిందని వెల్లడించారు. ఇన్నేళ్లుగా తమ సంభాషణలన్నీ సైలెంట్‌గా వింటూ కూడా ఏమీ తెలియనట్టు నటించడం మహేష్‌కే సాధ్యమని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. 

ఈ క్రేజీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.అసలు సిసలైన 'దూకుడు' అంటే మహేష్ బాబుదే.. సైలెంట్‌గా ఉంటూనే సీక్రెట్స్ అన్నీ లాగేశారుగా అంటూ అభిమానులు సూపర్ స్టార్ టైమింగ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  'మహేష్ అంటే సైలెంట్ ప్లేయర్', 'మాటలు తక్కువ.. మైండ్ గేమ్స్ ఎక్కువ', 'మరాఠీ అర్థమవుతుందనే విషయం ఇన్నేళ్లు దాచేయడం మహేష్ స్టైల్' అంటున్నారు ఫ్యాన్స్..