బెంగళూరు రోడ్ ట్రాఫిక్ లో సరికొత్త VIP దర్శనమిచ్చింది..ప్యాలెస్ రోడ్డులో నాగుపాటు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. BMW కారు లేకున్నా ట్రాఫిక్ జామ్ ను సృష్టించింది. పడగ విప్పి నడిరోడ్డుపై నాట్యామాడింది. ధ్యానంలోకి వెళ్లినట్లు రోడ్డుపై పడగవిప్పి కుదురుగా నిల్చుంది. ఈ అనుకోని అతిథి విన్యాసాలతో వాహనాదారులు బండ్లను ఆపుకొని వేచి చూడాల్సి వచ్చింది. ఒకటా రెండా..ఏకంగా 40 నిమిషాల పాటు ఈ వీఐపీ కోసం కమ్యూటర్స్ వేచి చూశారు.
మంగళవారం (జూలై 7) బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులో నడిరోడ్డపై పడగ విప్పి పాము కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ నాగుపాము దాదాపు 30-40 నిమిషాల పాటు రోడ్డుపైనే ఉండిపోయింది. ఇక పాము వెళ్లిపోయే వరకు కమ్యూటర్స్ అక్కడే ఉండిపోయారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ కమ్యూటర్ తన సెల్ ఫోన్ రికార్డు చేసి ఆన్ లైన్ లో పెట్టడంతో అందరినీ ఆకర్షించింది. వీడియోతో పాటు’’ నిన్న బెంగళూరు ట్రాఫిక్ లో సరికొత్త VIP వచ్చాడు..ప్యాలెస్ రోడ్ పైకోబ్రా అంటూ యూజర్ ఓ ట్యాగ్ లైన్ ఇచ్చారు.
నాగుపాటు అనుకోకుండా కనిపించడంతో సాయంత్రంవేళ అరుదైన వన్యప్రాణి దర్శనంగా భావించారు కమ్యూటర్స్. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బెంగళూరుకు ఇంతకుముందెన్నడూ లేని విధంగా ట్రాఫిక్ కంట్రోలర్ దొరికాడని కామెడీగాస్పందించారు.
ఇక్కడ వీడియో షేర్ చేసిన యూజర్ క్యాప్షన్ చాలా చమత్కారంగా ఉంది. బెంగళూరులో మాత్రమే BMW లేకుండా ఓ నాగుపాము ట్రాఫక్ జామ్ ను సృష్టించగలదు అంటూ రాశారు.
పోలీసు సిబ్బంది చివరకు సంఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా తరలించారు.అటు ప్రయాణికులకు, పాముకు ఎటువంటి హాని జరగకుండా చూసుకున్నారు. రోడ్డు నుంచి నాగుపామును తొలగించిన వెంటనే వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభించారు.
మారుతున్న పరిస్థితులు, అడవులను నరికి పట్టణాలు విస్తరిస్తున్న క్రమంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి ఎలా వస్తున్నాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది.
