పోలీస్ స్టేషన్ స్థలానికే ఎసరు.. కాపాడాలంటూ పోలీసుల ఫిర్యాదు

పోలీస్ స్టేషన్ స్థలానికే ఎసరు.. కాపాడాలంటూ పోలీసుల ఫిర్యాదు
  • రంగంలోకి దిగి షెడ్ల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలీసు స్టేష‌‌న్‌‌కు కేటాయించిన స్థలానికే కొందరు ఎసరు పెట్టగా, హైడ్రా రంగ ప్రవేశం చేసి కాపాడింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం, కొత్తపేట్ లోని సర్వే నంబర్లు 135, 136లో ఆరు గుంట‌‌ల స్థలాన్ని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌‌కు కేటాయించారు. సర్వే నంబర్ 135లో నాలుగు గుంటలు, సర్వే నంబర్ 136లో రెండు గుంటలు కలిపి 6 గుంటల స్థలంలో పోలీస్‌‌ స్టేష‌‌న్ ఏర్పాటుకు నిర్ణయించారు.

సర్వే నంబర్ 135లోని 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుని షెడ్లు వేసుకున్నారు. దీంతో ఆక్రమణలు తొల‌‌గించి పోలీసు స్టేష‌‌న్‌‌కు కేటాయించిన భూమిని కాపాడాల‌‌ని హైడ్రాను పోలీసు శాఖ కోరింది. దీంతో హైడ్రా అధికారులు ఫీల్డ్​లెవెల్​లో పరిశీలించి క‌‌బ్జాల‌‌ను నిర్ధారించుకున్నారు. బుధ‌‌వారం హైడ్రా టీమ్స్​రంగంలోకి దిగి షెడ్లను తొల‌‌గించాయి. ఆక్రమణలు మళ్లీ జరగకుండా ఆరు గుంటల స్థలానికి ఫెన్సింగ్ వేశారు. పోలీసు స్టేష‌‌న్ కోసం కేటాయించిన భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.