ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) 2026–-27 ఆర్థిక సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 750 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 750. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2026, జులై 31 లేదా అంతకంటే ముందే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 7.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.236, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు రూ.708, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.944.
లాస్ట్ డేట్: జులై 20.
ఆన్లైన్ ఎగ్జామినేషన్: ఆగస్టు 2 (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iob.bank.inను సందర్శించండి.
►ALSO READ | SAIL ఉద్యోగ నోటిఫికేషన్.. 40 ఏళ్లలోపు వారికి సువర్ణావకాశం.. పూర్తి వివరాలు ఇవే!
