ఐఐటీ హైదరాబాద్‌లో మంచి జీతంతో ఉద్యోగాలు.. సాఫ్ట్‌వేర్, బిజినెస్ అనలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

ఐఐటీ హైదరాబాద్‌లో మంచి జీతంతో ఉద్యోగాలు.. సాఫ్ట్‌వేర్, బిజినెస్ అనలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 7.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఆర్కిటెక్ట్ 1, ఏఐ ఇంజినీర్ 1, ఎంఈఆర్ఎన్ ఫుల్​స్టాక్ డెవలపర్ 3, బిజినెస్ అనలిస్ట్ 2.

విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

వయసు: పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.