ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో 321 ఉద్యోగాలు:జీతం, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు!

ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో 321  ఉద్యోగాలు:జీతం, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు!

ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్) స్కేల్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 321 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు  ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. (జనరలిస్ట్ & స్పెషలిస్ట్) (స్కేల్-I)

మొత్తం ఖాళీలు: 321.

విభాగాల వారీగా ఖాళీలు
స్పెషలిస్ట్– 121: ఫైనాన్స్ (సీఏ & సీఎంఏ) 20, లీగల్ 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ    11 (బ్యాక్‌‌లాగ్‌‌తో సహా), ఆటోమొబైల్ ఇంజినీర్స్ 20, రిస్క్ ఇంజినీర్స్ 28, కంపెనీ సెక్రటరీస్ 2, అగ్రికల్చర్ 20. జనరలిస్ట్–200.

విద్యార్హతలు
జనరలిస్ట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం) పూర్తి చేసి ఉండాలి.

ఫైనాన్స్: సీఏ  లేదా సీఎంఏ  పాస్ అయి ఉండాలి లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో  బి.కాం/ ఎం.కాం పూర్తి చేసి ఉండాలి.  

లీగల్: కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్​బీ/ ఎల్ఎల్ఎం పూర్తిచేసి ఉండాలి. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్ / ఐటీలో బీఈ/ బి.టెక్/ ఎంఈ/ ఎం.టెక్ లేదా కనీసం 60 శాతం మార్కులతో  ఎంసీఏ డిగ్రీ కలిగి ఉండాలి. 

ఆటోమొబైల్ ఇంజినీర్స్: కనీసం 60 శాతం మార్కులతో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌‌లో బీఈ/ బి.టెక్/ ఎంఈ/ ఎం.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.   రిస్క్ ఇంజినీర్స్: ఏదైనా బ్రాంచ్‌‌లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

కంపెనీ సెక్రటరీస్: ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా పూర్తి మెంబర్‌‌షిప్‌‌తో అర్హత సాధించి ఉండాలి.   

అగ్రికల్చర్: కనీసం 60 శాతం మార్కులతో అగ్రికల్చర్ సైన్స్ / హార్టికల్చర్ / అగ్రోనమీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొంది ఉండాలి.  

వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 8.

లాస్ట్ డేట్: అక్టోబర్ 28.

ఆన్​లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్-I: నవంబర్ 17.

ఆన్​లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్-II: డిసెంబర్ 22.

సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్–I, ఫేజ్–II ఆన్​లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  nationalinsurance.nic.co.in/recruitmentను సందర్శించండి.

 ఏఓ  ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో ఉంటుంది.
ఫేజ్-I: ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌‌లైన్)
 ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది మెరిట్ జాబితాకు పరిగణలోకి తీసుకోరు.  మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఇస్తారు.   ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం 60 నిమిషాల సమయం ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

ఫేజ్-II: మెయిన్స్ పరీక్ష
 ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి.   
ఆబ్జెక్టివ్ టెస్ట్: జనరలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులకు వేర్వేరు పాటర్న్ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంట్స్, జనరల్ అవేర్‌‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్​తోపాటు స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 250 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
డిస్క్రిప్టివ్ టెస్ట్: ఇంగ్లిష్ లాంగ్వేజ్‌‌పై 30 మార్కులకు (ఎస్సే, ప్రెసి రైటింగ్, కాంప్రహెన్షన్) ఆన్‌‌లైన్‌‌లో డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది.   మెయిన్స్ మార్కులే తుది ఎంపికకు కీలకం. ఇందులో కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.

ఫేజ్-III: ఇంటర్వ్యూ
మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను చివరగా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.  

తుది ఎంపిక: అభ్యర్థుల తుది ఎంపికను మెయిన్స్ పరీక్ష (80 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ (20 శాతం వెయిటేజీ)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు.