పదో తరగతి పాసయ్యారా ? హైదరాబాద్ MANUU యూనివర్సిటీలో జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

పదో తరగతి పాసయ్యారా ? హైదరాబాద్ MANUU యూనివర్సిటీలో జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

హైదరాబాద్​లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్​యూయూ– మనూ) డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

మొత్తం ఖాళీలు: 7.

విభాగాల వారీగా ఖాళీలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 6. 

విద్యార్హతలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డీటీపీలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఇంగ్లిష్ & ఉర్దూ టైపింగ్​లో పరిజ్ఞానం ఉండాలి. ఉర్దూ భాష తెలిసి ఉండాలి. 

మల్టీ  టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఐటీఐ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఉర్దూ భాష తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. 

వయసు: ఎంటీఎస్ పోస్టులకు 30 ఏళ్లు, డీఈఓ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: 2026, అక్టోబర్ 13 ఉదయం 10 గంటలకు. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ manuu.edu.inను సందర్శించండి.