ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా, ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్నతో కలిసి మాట్లాడారు. గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ భారీ వర్షాల కారణంగా వాయిదా పడిందని, ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు జగన్నాథపురంలో నిర్వహిస్తున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని చెప్పారు.
రైతు శ్రేయస్సే లక్ష్యంగా 9 రోజుల్లో రూ.9,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
