కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఏర్పాటు చేసిన 'యంగ్ ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్'లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల అయింది. విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ , నీట్, క్లాట్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీలను ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ యంగ్ ఇండియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్లలోని  6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,094 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

మరోవైపు, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ లో ప్రవేశాలకు సంబంధించి మొత్తం 3,720 సీట్లకు గాను ఇప్పటివరకు 2,741 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 979 ఇంటర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 16న అన్ని కేజీబీవీ-ఎక్సలెన్స్ కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్ల క్యాంపులు నిర్వహించనున్నారు.