వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఎన్ఏసీవో) నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేసి ఉత్తమ పనితీరుతో ‘సాక్ష్యం’ సర్టిఫికెట్ ను దక్కించుకుంది. ఎయిడ్స్ రోగుల గుర్తింపు, చికిత్స, నియంత్రణలో వికారాబాద్ వైద్యఆరోగ్య శాఖ ఉత్తమ పనితీరు కనబరిచింది.
దేశ వ్యాప్తంగా 70 జిల్లాలు మాత్రమే భారత ప్రభుత్వ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల లక్ష్యాల మేరకు పని చేశాయి. కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్వో సుధాకర్ లాల్, వైద్య సిబ్బంది కృషితో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశారు. 4,536 మంది హెచ్ఐవీ బాధితులను గుర్తించి, వారికి హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా యాంటీ రెట్రో వైరల్ థెరపీ చికిత్స అందించారు.
