లక్కీ నంబర్ 7 ఉన్నవాళ్లతో పెట్టుకుంటే అంతే.. పైకి సైలెంట్.. కానీ మనసులో ఏముంటుందో తెలుసా?

 లక్కీ నంబర్ 7 ఉన్నవాళ్లతో పెట్టుకుంటే అంతే.. పైకి సైలెంట్.. కానీ మనసులో ఏముంటుందో తెలుసా?

న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం, ఏ నెలలోనైనా 7, 16, లేదా 25వ తేదీల్లో పుట్టిన వారి లక్కీ నంబర్ 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. పైకి చాలా ప్రశాంతంగా కనిపించే ఈ వ్యక్తుల వెనుక ఎన్నో ఆసక్తికరమైన నిజాలు, అలవాట్లు ఉంటాయి. వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.

లక్కీ నంబర్ 7  వచ్చిన వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దామా:

1. నమ్మకానికి నిలువెత్తు రూపం
7 లక్కీ నంబర్ ఉన్నవారితో మీకు స్నేహం లేదా బంధుత్వం ఉంటే, వారిని అస్సలు అనుమానించకండి. వీరు ఏ పని చేసినా ధైర్యంగా, ముక్కుసూటిగా చేస్తారు కానీ.. వెన్నుపోటు పొడిచే అలవాటు వీరికి అస్సలు ఉండదు. ఎవరైనా వారిని అనుమానిస్తే చాలా బాధపడతారు. వీరు ఎంత నమ్మకస్థులంటే.. మీరు ఒక రహస్యాన్ని వీరితో చెప్పుకుంటే, అది ప్రాణం పోయినా బయటపెట్టరు.

2. ముఖం చూసి మనసు కనిపెడతారు
వీరిలో ఉన్న ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, ఎదుటివారి ముఖం చూడగానే వారి మనసులో ఏముందో, వారు ఎలాంటివారో ఈజీగా కనిపెట్టేస్తారు. ఎవరైనా సరే వీరితో మనసు విప్పి మాట్లాడవచ్చు. అయితే, వీరు ఇతరుల మాటలను చాలా త్వరగా మనసుకు తీసేసుకుంటారు. అందుకే వీరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి.

3. అతిగా ఆలోచించడం  
చిన్న చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకుని, రోజుల తరబడి ఆలోచించడం వీరికున్న పెద్ద బలహీనత. ఇలా అతిగా ఆలోచించడం వల్ల వీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. కొందరు వీరి ఈ సాఫ్ట్ క్వాలిటీని అనుకూలంగా వాడుకుని మోసం చేస్తుంటారు.

4. అందరి మాట వింటారు.. కానీ  
వీరు అందరితోనూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సలహా ఇస్తే ఓపికగా వింటారు కానీ, చివరకు వారి మనసుకు నచ్చిన పనే చేస్తారు. అలాగే వీరు చాలా న్యాయంగా ఉండాలని చూస్తారు. అందుకే వీరు మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే.. ఏదైనా తప్పు  లేదా గొడవ జరిగినప్పుడు తప్పు మీ వైపు ఉంటే మాత్రం మీ వైపు నిలబడరు.

5. విపరీతమైన ఎమోషనల్
వీరు చాలా సున్నిత మనస్కులు. పక్కవారి బాధను చూసి కూడా తట్టుకోలేరు. సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా ముందు ఉంటారు. కానీ, వీరికి ఏదైనా బాధ లేదా కష్టం వస్తే మాత్రం ఎవరితోనూ చెప్పుకోరు. ఒంటరిగా ఒక గదిలో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎవరైనా వచ్చి ఓదార్చినా వీరు అంత త్వరగా మారరు. వాళ్లకు వాళ్లే నచ్చజెప్పుకుని సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తారు.

పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపించినా.. లక్కీ నంబర్ 7 ఉన్న వ్యక్తుల మనసు చాలా వెన్న. వీరితో స్నేహం చేయడం ఒక అదృష్టం!

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.