భార్యను చంపి ప్రియురాలికి ఫోటో పంపాడు.. అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ అరెస్టు.. 9 నెలల దర్యాప్తులో ఎన్ని ట్విస్టులో..

భార్యను చంపి ప్రియురాలికి ఫోటో పంపాడు.. అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ అరెస్టు.. 9 నెలల దర్యాప్తులో ఎన్ని ట్విస్టులో..

ఈ సాఫ్ట్ వేర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్. ఎంత సాఫ్ట్ అంటే స్మూతీలో (ఒక రకమైన డ్రింక్)  విషం కలిపి స్మూత్ గా భార్యను లేపేసేంత. దేశం కాని దేశానికి నమ్మి వచ్చిన భార్యను పెళ్లయిన ఆరు నెలలకే కడతేర్చి.. ప్రియురాలికి ఆ ఫోటోలు పంపించిన ఈ సాఫ్ట్ కిల్లర్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 నెలలుగా దాచిన నిజాలను అన్ని ట్విస్టులను అధిగమించి.. అసలు గట్టు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 

తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ అవినాష్ నార్నే భార్య రాజిత సబ్బినేని (27), 2025 అక్టోబర్‌లో శవమై కనిపించింది. ఇండియాలో  మరో మహిళతో రహస్య ప్రేమాయణం కొనసాగిస్తూనే, పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు ఆధారాలు లభించడంతో, పోలీసులు నార్నేను అరెస్టు చేశారు. 

రాజిత డెడ్ బాడీ లభ్యమైన దాదాపు తొమ్మిది నెలల తర్వాత అవినాష్ నార్నేపై  హత్య ఆరోపణలు నమోదయ్యాయి.  ఆమెను గొంతు నులిమి చంపి, హత్యను దాచిపెట్టేందుకు కట్టుకథలు అల్లినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. రాజిత సబ్బినేని హత్య చేసిన మరుసటి రోజు ఆమె డెడ్ బాడీ ఫోటోను తన ప్రియురాలికి పంపినట్లు నార్నే పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 48 కోట్లు) బెయిల్‌పై కస్టడీలో ఉన్నాడు. నేరం రుజువైతే, వాషింగ్టన్ రాష్ట్ర చట్టం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చునని అంటున్నారు.

ALSO READ : పెళ్లయిన మూడు నెలలకే 22 ఏళ్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్న భర్త.. 

బాత్రూంలో భార్య డెడ్ బాడీ:

 2026 అక్టోబర్ నెలాఖరున  తన భార్య బాత్రూంలోపల తాళం వేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని.. రాత్రి  బెల్వ్యూ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. అధికారులు అక్కడికి చేరుకుని, బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించి చూడగా, సబ్బినేని నేలపై పడి ఉండటాన్ని గమనించారు. పెళ్ళి జరిగిన ఆరు నెలల లోపే, చనిపోయినట్లు నిర్ధారించారు పోలీసులు. 

అయితే, ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలో గొంతు నులమడం వల్ల  ఊపిరాడకపోవడంతో మరణించినట్లు తేలడంతో..  హత్యగా నిర్ధారించారు పోలీసులు.  దర్యాప్తు ప్రకారం అనుమానాలు భర్తపై వస్తున్నప్పటికీ..  అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులను తప్పుడు వాదనలతో డైవర్ట్ చేసినట్లు తెలిపారు.

ట్విస్టులు:

భార్య రాజిత చనిపోయిన రోజు ఉన్నాయని ఇంటి నుచి బయటకు వెళ్లి, 40 నిమిషాల తర్వాత తిరిగి వచ్చానని నార్నే డిటెక్టివ్‌లకు చెప్పాడు. బాత్రూమ్‌లో తాళం వేసి ఉండటాన్ని గమనించి  పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిపారు.  నార్నే బయటకు వెళ్లినట్లు రికార్డులు సీసీటీవీలో కనిపించాయి.. కానీ అతను లేని సమయంలో  అపార్ట్‌మెంట్‌లోకి మరెవరూ ప్రవేశించలేదని సీసీటీవీ ఆధారంగా తెలిసింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేశారనే వాదదను పోలీసులు కొట్టిపారేశారు. 

సీక్రెట్ ఎఫైర్:

హత్యలో నార్నేకు సంబంధం ఉందని భావించిన పలీసులు.. ఫోన్, మెసేజ్ లను  పరిశీలించగా షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. సబ్బినేనిని పెళ్లి చేసుకోవడానికి ముందు నార్నేకు ఇండియాలో  మరో మహిళతో సీక్రెట్ రిలేషన్షిప్ ఉన్నట్లు తెలుస్తోంది.  పెళ్లి తర్వాత కూడా ఆ రిలేషన్ షిప్ కొనసాగిందని, ఆ మహిళ వీళ్ల పెళ్లికి కూడా  అటెండ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం, పెళ్లి తర్వాత కూడా ఆ మహిళతో రిలేషన్ షిప్ కొనసాగించినట్లు పోలీసులు నిర్ధారించారు. 

స్మూతీలతో స్మూత్ గా..

సబ్బినేని హత్యకు ముందు భార్య భర్తల మధ్య జరిగిన చాటింగ్ ను పోలీసులు ట్రేస్ చేశారు. పోలీసులు చెప్పినదాని ప్రకారం.. నార్నే చేసి ఇచ్చిన స్మూతీలు చేదుగా ఉన్నాయని పలుమార్లు చెప్పినట్లు ఛాటింగ్ ఆధారంగా తెలిసింది. చనిపోయిన రోజు తాగిన స్మూతీ.. మందు కలిసినట్లుగా.. దగ్గు టానిక్ లాగా ఉందని ఆమో ఆరోపించినట్లు చెప్పారు. అధికారులు ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు, భార్యకు ఒంట్లో బాగోలేదని, దగ్గు మందు తాగిన తర్వాత కుప్పకూలిపోయి ఉండవచ్చని నార్నే వారితో సూచించారు.

నెలల తరబడి దర్యాప్తు:

సబ్బినేని చనిపోయిన తర్వాత దాదాపు ఎనిమిది నెలల పాటు దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది., డిటెక్టివ్‌లు సాక్ష్యాలను సేకరిస్తూ, డిజిటల్ రికార్డులను సమీక్షిస్తూ, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పటికీ నార్నే ప్రశాంతంగా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.  

హత్యముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందన్న ప్రాసిక్యూటర్ల ఆరోపణను అంగీకరించిన కోర్టు.., జూలై 1న అవినాశ్ నార్నేపై అధికారికంగా  ఫస్ట్-డిగ్రీ మర్డర్ ఛార్జెస్ ను నమోదు చేసింది.