పెళ్లయిన మూడు నెలలకే 22 ఏళ్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్న భర్త.. 38 ఏళ్ల లవర్ కోసం కాల్చి చంపేశాడు

పెళ్లయిన మూడు నెలలకే 22 ఏళ్ల అమ్మాయిని పొట్టన పెట్టుకున్న భర్త.. 38 ఏళ్ల లవర్ కోసం కాల్చి చంపేశాడు

కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు వీళ్లు.. అని అనిపిస్తుంది. లేకపోతే పెళ్లయిన నెల రెండు నెళలకే చంపేసుకోవడమేంటి..? ఒక కేసులో భర్తను భార్య చంపడం.. మరో కేసులో భార్యను భర్త హత్య చేయడం.. రెగ్యులర్ గా జరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే కలిసుండలేం అనే అవగాహనకు వస్తున్నారా..? లేక  అంతకు ముందే లవర్ ఉండి.. పెళ్లయితే కానీయ్.. లేపేసి మళ్లీ మన లవర్ తో కలిసి ఉందాం అనే ధీమాతో పెళ్లికి ఒప్పుకుంటున్నారా..? అర్థం కాని ప్రశ్న. 

ఈ కేసు కూడా అలాంటిదే. పెళ్లయి మూడు నెలలు గడిచింది అంతే. కట్టుకున్న భార్యను లవర్ రూమ్ కు తీసుకెళ్లి షూట్ చేశాడో ఓ దుర్మార్గుడు. పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ ను సియా గోయల్ చంపేసిన ఘటన దేశం మరువక ముందే అలాంటిదే మరో ఘటన జరగటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఈ కేసు మే 22న పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితురాలి తల్లి గురుగ్రామ్ లోని మనేసార్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. మనేసార్ కు చెందిన అంకిత్ అనే వ్యక్తికి ఇచ్చి తన కూతురిని పెళ్లి చేశామని.. కానీ పెళ్లయిన మూడు నెలలకే కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. 

►ALSO READ | ఘోరం.. భార్యను కాపురానికి రమ్మని అడగటానికి వెళ్లి.. బామ్మర్ది చేతుల్లో కాలి బూడిదయ్యాడు.. వీడియో వైరల్

మే 21న ఆ వివాహిత మిస్సింగ్ అయ్యింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరకలేదు. భర్త తనకు తెలియదన్నట్లుగా నాటకం ఆడుతూ.. పేరెంట్స్ తో పాటు వెతికే పనిలో ఉంటూ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. 

దర్యాప్తులో భాగంగా మే 22న మనేసర్ లోని ఒక రూమ్ లో వివాహిత డెడ్ బాడీ దొరికింది పోలీసులకు. ఆమెను కాల్చి చంపేసినట్లు నిర్ధారించారు. 

ఎలా ప్లాన్ చేశారంటే..

సుదీర్ఘ విచారణ తర్వాత పోలీసులు వివాహిత భర్త అంకిత్ (25) ను మనేసర్ లో, అతని 38 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ రజినీదేవిని  హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో అరెస్టు చేశారు. అంకిత్ మానేసర్ లో పాన్ షాపు నడిపిస్తుండగా.. రజినీ అదే ఏరియాలో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. 

మూడేళ్ల ఎఫైర్.. మర్డర్ ప్లాన్:

పోలీసుల విచారణలో..  అకింత్, రజినీ ఇద్దరి మధ్య మూడేళ్లుగా ఎఫైర్ ఉన్నట్లుగా ఒప్పుకున్నారు. హత్య ప్లాన్ రజినీ కిరాయి రూమ్ లోనే చేసినట్లు చెప్పారు. హత్య జరిగిన రోజు.. అంకిత్ తన భార్యను రజినీ రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దర కలిసి అంకిత్ భార్యను చంపేసి నేపాల్ కు పారిపోయారు. 

మర్డర్ కోసం వాడిన గన్ ఉత్తరప్రదేశ్ లో రెండు నెలల క్రితమే కొనుగోలు చేసినట్లు చెప్పారు. 

జూన్ 30 వరకు నేపాల్ లోనే ఉన్న నిందితులు.. ఇండియా రాఆనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. దర్యాప్తు జరుగుతోందని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.