Kiran abbavaram: ఇలాంటి ప్రేమకథ ఎప్పుడూ చూడలే.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్..

Kiran abbavaram: ఇలాంటి ప్రేమకథ ఎప్పుడూ చూడలే.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్..

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ', సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్ కేఎన్ తో కలిసి నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వం వహించాడు. జులై 24న సినిమా విడుదల కానుంది. తాజాగా విజయవాడలో లవ్ కార్నివాల్ పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించారు.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే ఈ సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ హాయిలా హాయిలా'ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రామిస్ చేసి చెబుతున్నా. వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమ కథను ఈ సినిమాలో చూడబోతున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఒక్క లైఫ్ కు కనెక్ట్ అవుతారు. స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికీ చాలా కాలం గుర్తుండిపోయే సినిమా అవుతుంది' అని చెప్పాడు.

ALSO READ : ఒక్క సినిమా.. మూడు పేర్లు.. 48 గంటల్లో మాయం..

ఈ చిత్రంలో నటించడం లవ్లీ ఎక్స్ పీరియెన్స్ అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ చెప్పింది. ఇది ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రమని ప్రొడ్యూసర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్ అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.