ఒక్క సినిమా.. మూడు పేర్లు.. 48 గంటల్లో మాయం.. దిల్జీత్ 'సత్లుజ్' వివాదం ఏంటి?

ఒక్క సినిమా.. మూడు పేర్లు.. 48 గంటల్లో మాయం.. దిల్జీత్ 'సత్లుజ్' వివాదం ఏంటి?

టాలెంటెడ్ సింగర్, యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా 'సత్లుజ్' (Satluj). ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది. దాదాపు నాలుగేళ్ల సెన్సార్ వివాదాలు, కోర్టు గొడవలు దాటుకుని జూలై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Zee5 లో ఈ సినిమా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయింది. కట్ చేస్తే... కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను ఇండియాలో బ్యాన్ చేసేశారు. Zee5 ఇండియా కేటలాగ్ నుండి ఈ మూవీని అర్ధాంతరంగా తొలగించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ALSO READ : LENIN: హిట్ కోసం వెంకన్నను దర్శించుకున్న అఖిల్..

అసలేంటి ఈ సినిమా కథ?

పంజాబ్‌లో 1984 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన తీవ్రవాద అణచివేత నేపథ్యంలో... వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని బట్టబయలు చేసిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, 1995లో ఖల్రా కూడా మిస్టీరియస్‌గా అదృశ్యమయ్యారు . ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు తేలింది. పంజాబ్ హిస్టరీలోనే అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన ఈ రియల్ స్టోరీని టచ్ చేయడమే ఈ సినిమా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి కారణం.

'ఘల్లుఘారా' నుండి 'సత్లుజ్' దాకా...

ఈ సినిమాకు మొదట పెట్టిన పేరు 'ఘల్లుఘారా' (Ghallughara). ఈ టైటిల్‌పై  సెన్సార్ బోర్డ్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేకర్స్ కోర్టుకెళ్లారు.  టైటిల్‌ను 'పంజాబ్ 95'గా మార్చారు. 2023 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రీమియర్ కావాల్సిన ఈ సినిమాను రాజకీయ కారణాలతో చివరి నిమిషంలో నిలిపేశారు. థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాకపోవడంతో, చివరకు 'సత్లుజ్' అనే పేరుతో Zee5 లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అన్‌కట్ వర్షన్‌ను నేరుగా రిలీజ్ చేశారు.

48 గంటల హైడ్రామా!

జూలై 3న రిలీజ్ అయిన ఈ సినిమా ను సోమవారాని కల్లా ( జూలై 6, 2026 ) తీసేస్తారేమో.. త్వరగా డౌన్లోడ్ చేసుకోండి.. అంటూ నటుడు దిల్జీత్ దోసాంజ్ ముందే ఊహించి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో హింట్ ఇచ్చారు. ఆయన భయపడినట్లే ఆదివారం రాత్రికల్లా Zee5 ఇండియాలో ఈ సినిమాను నిలిపివేసింది. ప్రస్తుతం కరెంట్ డెవలప్మెంట్స్ వల్ల ఇండియాలో మాత్రమే స్ట్రీమింగ్ ఆపామని, విదేశాల్లో (Zee5 Global) మాత్రం అందుబాటులోనే ఉంటుందని సంస్థ ప్రకటించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 5 (@zee5)

 

దీనిపై దిల్జీత్ స్పందిస్తూ పంజాబీలో ఎమోషనల్ అయ్యారు. నన్ను ఎంతైనా ఇబ్బంది పెట్టండి, చనిపోయే వరకు నేను పంజాబ్ వైపే ఉంటా. సినిమా ఆల్రెడీ ఇంటర్నెట్‌లోకి వచ్చేసింది, పైరసీ అయినా సరే అందరికీ చూపించండి. జస్వంత్ సింగ్ ఖల్రా త్యాగం గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ 'సత్లుజ్' వివాదం సోషల్ మీడియాను ఊపేస్తోంది..