తిరుపతి: తిరుమల ఏడుకొండల స్వామిని 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ దర్శించుకుంది. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర.. నవనీతమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం చేయించారు.
దర్శనం తర్వాత.. రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
— B R Naidu (@BollineniRNaidu) July 6, 2026
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు… pic.twitter.com/3Cbu2loCVX
ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్కు హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు.
►ALSO READ | ఆధ్యాత్మిక రహస్యం: తిరుమల కొండలు ఎందుకు ఎక్కాలి.. ఏడుకొండలు వాటి పరమార్దం ఏమిటి
నవనీతమ్మను గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం తమ అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
