రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులు ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్ గా తేలుతుంది అనుకున్న కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తన కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోట కొండ అంచు నుంచి కిందకు తోసివేసిన కేసులో.. సియా గోయల్, చేతన్ చౌదరిల ఇద్దరి ప్రమేయం ఉందని నిర్ధారణ అయినప్పటికీ.. తోసింది ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో లై డిటెక్టర్ టెస్టు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
ఈ హత్య కేసులో మెయిన్ అక్యూస్డ్ అయిన సియా గోయల్‌కు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ పూణే పోలీసులు గురువారం (జూలై 2) కోర్టును ఆశ్రయించారు. పోలీసుల సమాచారం ప్రకారం, కేతన్ అగర్వాల్‌ను లోయలోకి ఎవరు తోశారో నిరూపించగల ప్రత్యక్ష సాక్షులు గానీ, స్పష్టమైన ఆధారాలు గానీ ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో లభించలేదు.
దీంతో లై డిటెక్టర్ టెస్టు కోసం కోర్టు అనుమతి కోరారు పోలీసులు. సియా , సహ నిందితుడు చేతన్ చౌదరి వాంగ్మూలాలను ఇప్పటికే రికార్డ్ చేశామని, అయితే పాలిగ్రాఫ్ టెస్టు ఈ కేసులో కొత్త ఎవిడెన్స్ అందిస్తుందని భావిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా నిందితుల ఇచ్చిన వాంగ్మూలాలు ఎంత వరకు వాస్తవమో కన్ఫమ్ చేయవచ్చునని భావిస్తున్నారు. దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ టెస్టు సహాయపడుతుందని పోలీసులు కోర్టు ముందు వాదించారు.
రిహార్సల్ చేసిన ప్లేస్ కు సియా:
తన కాబోయే భర్త, రియల్టర్ అయిన కేతన్ అగర్వాల్‌ను లోహగడ్ కోట దగ్గర ఉన్న కొండ అంచునుంచి కిందకు తోసివేయడానికి సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి ముందస్తుగా రిహార్సల్ చేసిన విషయం తెలిసిందే. పుణెలోని ఆ ప్రదేశానికి పోలీసులు సియా గోయల్‌ను తీసుకెళ్లినట్లు చెప్పారు.
►ALSO READ | స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి.. వాట్సాప్ ద్వారా లొకేషన్.. ఏడాదికి రూ.5 కోట్ల బిజినెస్ గుట్టు రట్టు
కేతన్ ను తోసివేయడానికి ముందు సియా, చేతన్‌లు లల్లానగర్‌లోని ఒక క్లబ్ పక్కన ఓపెన్ ప్లేస్ లో రిహార్సల్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. రిహార్సల్ చేసినట్లు ఆరోపణలు ఉన్న ఆ ప్లేస్ ను గుర్తించినట్లు పూణే రూరల్ పోలీస్ అధికారి తెలిపారు.
పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. ఘటన జరిగిన రోజైన జూన్ 18న గోయల్ ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, అగర్వాల్ తమ సంబంధానికి అడ్డంకిగా మారుతున్నాడనే కారణంతో గోయల్, చౌదరి అతడిని హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి.
కేతన్ అగర్వాల్ హత్య కేసు
మహారాష్ట్రలో అత్యంత వివాదాస్పదం, వైరల్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లలో కేతన్ అగర్వాల్ హత్య కేసు ఒకటి. పూణేకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్, 2026 జూన్ 18న చారిత్రాత్మక లోహగడ్ కోట పైనుంచి తోసివేయడంతో చనిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబోయే భార్య సియా గోయల్, తన లవర్ గా ఆరోపిస్తున్న చేతన్ చౌదరితో కలిసి కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనను మొదట్లో ప్రమాదవశాత్తు కిందపడటంగా చిత్రీకరించారు. కేతన్ కోట నుంచి జారిపడ్డాడని సియా అతని కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత జరిగిన పోలీసు విచారణలో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. ఈ దర్యాప్తు అనంతరం, జూన్ 23న సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్టు చేశారు.
