ఇంగ్లాండ్లో సైలెంట్గా రోహిత్ ప్రాక్టీస్.. 2027 వరల్డ్ కప్ కోసం హిట్‌మ్యాన్ గేమ్ స్టార్ట్!

ఇంగ్లాండ్లో సైలెంట్గా రోహిత్ ప్రాక్టీస్.. 2027 వరల్డ్ కప్ కోసం హిట్‌మ్యాన్ గేమ్ స్టార్ట్!

Rohit Sharma: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే సిరీస్ కోసం ముందే ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోయే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటమే అతని ప్రస్తుత లక్ష్యం. కానీ, ఈ మెగా టోర్నీకి ముందు రోహిత్ శర్మ ఆడే ప్రతి వన్డే సిరీస్ అతనికి ఒక అగ్నిపరీక్ష లాంటిదేనని చెప్పాలి.

హిట్‌మ్యాన్ వేధిస్తున్న ఫిట్‌నెస్: 
గత కొంతకాలంగా రోహిత్ శర్మను ఫిట్‌నెస్ సమస్యలు గట్టిగానే వేధిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring Injury) కారణంగా అతడు ఏకంగా 5 మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని ఫిట్‌నెస్‌పై క్రికెట్ వర్గాల్లో పలు ప్రశ్నలు మొదలయ్యాయి. అంతేకాదు, 2027 వరల్డ్ కప్‌లో రోహిత్ స్థానం ఖాయమని టీమ్ మేనేజ్‌మెంట్ వైపు నుంచి ఎలాంటి హామీ రాలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ టూర్‌లో రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడు. అందుకే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే లండన్ చేరుకుని గట్టిగానే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాడు.

ఇంగ్లాండ్ కండిషన్స్‌కి అలవాటు పడాలనే:   
ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ అందరికంటే ముందే లండన్ చేరుకున్నాడు. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు లండన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని స్థానిక క్లబ్ మైదానాల్లో జోరుగా నెట్ ప్రాక్టీస్ (Net Sessions) చేస్తూ గంటల తరబడి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ వికెట్లపై ఆడిన రోహిత్.. ఇంగ్లాండ్‌లో ఉండే స్వింగ్, బౌన్స్‌కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడుతున్న ఇండియన్ టీమ్ అక్కడి కండిషన్స్‌కు ఇంకా అలవాటు పడలేక బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతుంది. దీంతో హిట్‌మ్యాన్ ముందే అలర్ట్ అయి ప్రత్యేకంగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. 

►ALSO READ | నేడే భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20.. సంజు ఇన్, వైభవ్, తిలక్ ఔట్.. ప్లేయింగ్ XI ఇదే!

ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ రికార్డు అదుర్స్:
ఇంగ్లాండ్ పిచ్‌లు రోహిత్ శర్మకు చాలా బాగా కలిసి వస్తాయి. అక్కడ అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు 27 వన్డే  మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 1428 రన్స్ కొట్టాడు.  అతడి బ్యాటింగ్ యావరేజ్ 64.9 (ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చిన ఏ విదేశీ బ్యాటర్‌కు లేనంత అత్యధిక సగటు ఇది) ఉంది.

జులై 14 నుంచే వన్డే సిరీస్ స్టార్ట్:
జులై 14వ తేదీ నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. ఈ పర్యటన ద్వారా భారీ స్కోర్లు చేసి, తన ఫామ్ అండ్ ఫిట్‌నెస్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని హిట్‌మ్యాన్ పట్టుదలగా ఉన్నాడు.