ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా, చెడు అలవాట్లతో ఎంత సంపాదించినా దండగే. సరైన ఆహారం తీసుకుంటూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే చాలు. ఇక మీరు లక్షలు, కోట్లు సంపాదించనట్టే లెక్క. చాలా మంది వ్యసనాలకు బానిసలై.. మందు కొడుతూ.. సిగరెట్లు తాగుతూ.. సరైన ఆహారం తీసుకోకుండా.. ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటారు. అలాంటి వాళ్లు ఎంత సంపాదించినా చివరకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే.. ఆస్పత్రి బిల్లులకు ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. మీ కుటుంబాన్ని రోడ్డున పడేసినట్లే.
అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహా భాగ్యం అని. ఆరోగ్యంగా ఉన్నట్లయితే కోట్లు సంపాదించినట్లే అని. అయితే ఏ జాగ్రత్త తీసుకుంటే.. శరీరంలోని ఏ అవయవం ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఊపిరితిత్తులు మంచిగా ఉండాలంటే.. ఉపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం. సిగరెట్లు, బీడీ వంటి వాటికి దూరంగా ఉండాలి. దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బు ఆదా.
2. గుండె పదిలంగా ఉండాలంటే తినే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నోటికి రుచి.. ఆహారానికి టేస్ట్ కోసం ఉప్పును ఎక్కువగా వాడితే గుండెకు చేటు చేస్తోంది. ఉప్పు ఎంత తక్కువగా వాడితే గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది.
3. కాలేయ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకే కాదు ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. సన్నగా ఉన్నాం మనకు కొవ్వు ఏంటీ అనుకోవచ్చు.. సన్నగా ఉన్నవాళ్లకు బ్యాడ్ కొలస్ట్రాల్ ఉంటుంది. మద్యం, ధూమపానం వల్ల బ్యాడ్ కొలస్ట్రాల్ వస్తుంది. దీని వల్ల కాలేయం డ్యామేజ్ అవుతుంది.
►ALSO READ | జ్యోతిష్యం:2026 జులై 10 యోగిని ఏకాదశి చాలా పవర్ ఫుల్ .. ఏ రాశి వారు ఏం చేయాలి..
4. ఉదర (కడుపు) సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే చల్లటి ఆహారం తీసుకోకూడదు. ఆహారాన్ని ఎప్పుడూ వేడిగా తీసుకోవాలి. వేడి వేడిగా తినాలి. ఫ్రిజ్ లో పెట్టి చల్లటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత వేడి చేసి తిన్నట్లయితే కడుపునకు సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
5. పేగుల సంరక్షణ కోసం జంక్ ఫుడ్ మానేసి కూరగాయలు తినడం మేలు. పిజ్జా, బర్గర్, చిప్స్, హాట్ డాగ్స్, క్యాండీలు, ప్యాకేజీ ఫుడ్స్. జంక్ ఫుడ్ వల్ల పేగుల్లో కొలస్ట్రాల్ పేరుకుపోతుంది. మలబద్దకం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం వల్ల రోగాలు కొనితెచ్చుకున్నట్లే. అందుకే జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే కడుపు అంత హాయిగా ఉంటుంది.
6. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయం పూట ఎక్కువ నీళ్లు తాగుతూ, రాత్రుళ్లు తక్కువగా తాగాలి. ఈ కాలంలో కిడ్నీలు పాడైపోవటం ఎక్కువగా జరుగుతుంది. దీనికి కారణం సరైన రీతిలో మంచి నీళ్లు తాగకపోవటం ఒక కారణం. ఉదయం పూట ఎక్కువ నీళ్లు తాగుతూ.. రాత్రి సమయాల్లో తక్కువ మంచి నీళ్లు తాగటం ద్వారా కిడ్నీలపై భారం పడదు. ఆరోగ్యంగా ఉంటాయి.
7. మెదడు చురుగ్గా పని చేయడానికి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. అన్నింటి కంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నిద్ర. మీరు ఎంత హాయిగా.. ప్రశాంతంగా.. రోజూ 8 గంటలు నిద్రపోతారో అప్పుడు మీ మెదడు చురుగ్గా పని చేస్తుంది. మెదడు చురుగ్గా పని చేయటం వల్ల శరీరానికి అలసట ఉండదు.
పైన చెప్పిన ఈ 7 ఏడు అలవాట్లను క్రమం తప్పకుండా రోజూ పాటించినట్లయితే.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. రోజూ హ్యాపీగా.. ఆనందంగా ఉంటారు.
