కార్పోరేట్ హాస్పిటల్స్ లోనే వైద్యం బాగుంటుందనేది తప్పు అని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యం అందుతోందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జులై 09 (గురువారం) సంగారెడ్డి పర్యనటకు వెళ్లిన మంత్రి వివేక్.. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ESI డిస్పెన్సరీ ప్రారంభించారు.
ఈ ప్రాంతం లో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈ డిస్పెన్సరీని ప్రారంభించామని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో 72 కోట్ల బకాయిలు ఉండే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బకాయిలు చెల్లించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
కార్మికులకు కష్టపడి పనిచేస్తారు.. వారికి వైద్య సేవలు అందించాలి అని అన్నారు. సనత్ నగర్ పోకుండా వారి ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వైద్యం కోసం మద్యతరగతి ప్రజలు డబ్బులు ఖర్చు చేస్తున్నారని అన్నారు.
కార్మికుల మినిమం వెజెస్ ని పెంచామని ఈ సందర్బంగా అన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్స్ యాక్ట్ తెచ్చాం.. ఆ వర్కర్ లకు భద్రత కల్పించాలని యాక్ట్ తెచ్చాం.. రాహుల్ గాంధీ సూచన ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లు ఏర్పాటు చేస్తూ యువత కు ఉపాది కల్పిస్తున్ననట్లు తెలిపారు. మందిమర్రిలో 50 మందికి జర్మన్ నేర్పిస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో కూడా అలాంటి ఆలోచన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
