రామచంద్రాపురం, వెలుగు: ప్రతీ ఓటరు బాధ్యతగా సర్ ప్రక్రియలో పాల్గొనాలని సంగారెడ్డి కలెక్టర్ప్రతీక్ జైన్ కోరారు. మంగళవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్‌ల్లో కొనసాగుతున్నసర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఫారాల స్వీకరణ, పత్రాల పరిశీలన, తనిఖీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు నాయక్, ఈఆర్ఓ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
