Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ, టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అతని కుటుంబం నుంచి గట్టి మద్దతు లభించింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ చేతిలో 125 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయిన తర్వాత.. శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడిపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ కఠినమైన పరిస్థితులు అతన్ని మరింత బలమైన నాయకుడిగా మారుస్తాయని పేర్కొంది.
భారత జట్టుపైనే శ్రేయస్ ఫైర్:
ఈ 125 పరుగుల తేడాతో ఓడిపోవడంపై భారత టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిగా నమోదైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2–0తో ముందంజలో ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమాత్రం వెనకాడకుండా టీమిండియా ప్రదర్శనను తీవ్రంగా తప్పుపట్టాడు. జట్టు ఆటతీరు చాలా దారుణంగా (Atrocious) ఉందని, అన్ని విభాగాల్లోనూ భారత్ విఫలమైందని అతడు ఒప్పుకున్నాడు.
కష్టకాలంలో జట్టుకు మద్దతు ఇవ్వండి:
జట్టు ప్రదర్శనపై విమర్శలు వస్తున్న తరుణంలో, శ్రేష్ఠ అయ్యర్ ఫిల్మీగ్యాన్ (Filmigyan) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరుడికి మద్దతుగా ఒక ఎమోషన్ మెసేజ్ ని షేర్ చేసుకుంది. ప్రతి కెప్టెన్ ప్రయాణంలోనూ ఇలాంటి కష్టమైన దశలు రావడం సహజమేనని, శ్రేయస్ ఈ అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతాడని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. శ్రేయస్ భవిష్యత్తులో భారతదేశపు అత్యుత్తమ (Best) కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో అభిమానులందరూ ఇండియాన్ టీమ్ కు తమ పూర్తి మద్దతును అందించాలని శ్రేష్ఠ కోరింది.
►ALSO READ | ఇంగ్లాండ్లో సైలెంట్గా రోహిత్ ప్రాక్టీస్.. 2027 వరల్డ్ కప్ కోసం హిట్‌మ్యాన్ గేమ్ స్టార్ట్!
అంతర్జాతీయ వేదికపై ఒత్తిడి:
దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ (IPL) లోనూ తన అద్భుతమైన కెప్టెన్సీతో ప్రశంసలు అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పుడు బలమైన ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియాను నడిపించడంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు ఫలితాలు భారత్‌కు అనుకూలంగా రాకపోయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ లోని పట్టుదల, నిలకడ అతనికి ఈ ప్రారంభ అడ్డంకులను దాటడానికి సహాయపడతాయని అతని సోదరి శ్రేష్ఠ అయ్యర్ నమ్ముతోంది.
నాలుగో టీ20.. డూ ఆర్ డై:
భారత జట్టు సిరీస్‌లో నిలవాలంటే ఈరోజు (గురువారం) జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో ఓటమి ఎదురైతే సిరీస్ ఇంగ్లాండ్ వశమవుతుంది. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌పై ఒత్తిడి పెరుగుతున్న వేళ, శ్రేయస్ అయ్యర్ కుటుంబం తనపై ఉంచిన నమ్మకాన్ని మైదానంలో అద్భుతమైన ప్రదర్శనగా మార్చి.. భారత్‌ను మళ్లీ విజయాల బాటలోకి నడిపిస్తాడో లేదో చూడాల్సిందే.
🚨 Shrestha Iyer backs Shreyas Iyer to become one of India's best captains:
— TEJASH 🚩 (@LoyleRohitFan) July 8, 2026
"Just wait and watch. He will be one of India's best captains. It's easy for us to say, 'As a captain, he's losing, he's losing.' But you don't know the full picture. People only judge a captain based on… pic.twitter.com/vE1hthKo6d
