కాటుకే అక్కర్లేని ఆ కళ్ళు.. డైలాగ్ ఉంది గానీ సీన్ లేదు.. ‘పెద్ది’లోని మోస్ట్ ట్రోలింగ్ సీన్ను ఓటీటీలో లేపేసిన నెట్ఫ్లిక్స్ !

కాటుకే అక్కర్లేని ఆ కళ్ళు.. డైలాగ్ ఉంది గానీ సీన్ లేదు.. ‘పెద్ది’లోని మోస్ట్ ట్రోలింగ్ సీన్ను ఓటీటీలో లేపేసిన నెట్ఫ్లిక్స్ !

‘పెద్ది’ సినిమా ఓటీటీకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే.. థియేటర్లలో సినిమా చూసినప్పటికీ.. ఓటీటీలో కూడా ‘పెద్ది’ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించారు. ‘పెద్ది’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానపై తీవ్ర విమర్శలకు కారణమైన ఒక సన్నివేశాన్ని ఓటీటీ వెర్షన్లో తొలగించారు. ‘పెద్ది’ అచ్చియమ్మను చూసిన సందర్భంలో ఆమె అందాన్ని తన స్నేహితుడికి వర్ణిస్తూ ఒక సన్నివేశం ఈ సినిమాలో ఉంది.

ఈ సన్నివేశంలో.. కాటుకే అక్కర్లేని ఆ కళ్లు అని ‘పెద్ది’ చెప్పగానే ‘అచ్చియమ్మ’ కళ్లను కాకుండా దర్శకుడు బుచ్చిబాబు సాన ఆమె అందాలను చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కళ్లను గురించి వర్ణిస్తూ అచ్చియమ్మ ఒంపుసొంపులను చూపించడంతో బుచ్చిబాబు తీవ్ర విమర్శలు మూటగట్టుకోక తప్పలేదు. ‘ఉప్పెన’ సినిమాలో కూడా ఒక పాటలో హీరోయిన్ అందచందాలను బుచ్చిబాబు తెరకెక్కించిన తీరును గుర్తుచేసి మరీ.. అతనికి ఇదేం పైత్యం అని థియేటర్లలో సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ మండిపడ్డారు.

‘పెద్ది’లో కాటుకే అక్కర్లేని ఆ కళ్లు సన్నివేశంపై.. సోషల్ మీడియాలో బుచ్చిబాబును మీమర్స్, ట్రోలర్స్ ఘోరంగా ట్రోల్ చేశారు. హీరోయిన్ పట్ల దర్శకుడు బుచ్చిబాబు సాన ఆలోచనా తీరు మారాలని ఈ సన్నివేశంపై అభ్యంతరం తెలిపిన మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

ఇంత రచ్చకు కారణమైన ఈ సన్నివేశాన్ని ఓటీటీలో నెట్ఫ్లిక్స్ తొలగించినప్పటికీ సంభాషణను మాత్రం యథాతథంగా ఉంచారు. ఆ సంభాషణ వచ్చిన సందర్భంలో సన్నివేశాన్ని సందర్భోచితంగా మార్చేశారు. థియేటర్లలో కాకుండా ‘పెద్ది’ని నేరుగా ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులకు ఈ మార్పు అర్థం కాకపోవచ్చు.

►ALSO READ | PEDDI OTT: ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’.. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఏం మారింది?