PEDDI OTT: ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’.. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఏం మారింది?

PEDDI OTT: ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’.. థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఏం మారింది?

రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) ఓటీటీలోకి అడుగుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ జులై 9 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, థియేట్రికల్ వెర్షన్లో గతంలో కట్ చేసిన కొన్ని ముఖ్యమైన సీన్స్ని ఓటీటీ వెర్షన్‌లో తిరిగి యాడ్ చేశారు. ఇక థియేటర్లో పెద్దిని మిస్ అయిన ఆడియన్స్కు.. ఓటీటీ వెర్షన్ కొత్త అనుభూతిని అందించనుంది. ఇకపోతే, పెద్ది సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ నటన, ఊరి గుర్తింపు కోసం చేసే పోరాటం సినిమాకు మంచి మైలేజ్ తీసుకొచ్చింది.

థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఏం మారింది?

థియేటర్లలో 'పెద్ది' 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) రన్ టైంతో విడుదలైంది. అయితే రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం, కొన్ని సన్నివేశాలపై ఓ వర్గం ఆడియన్స్ నుంచి విమర్శలు రావడంతో విడుదల తర్వాత చిత్రబృందం కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో థియేటర్లలో తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలను తిరిగి జత చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే విడుదల సమయంలో ట్రోలింగ్‌కు గురైన హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని క్లోజ్‌అప్ షాట్స్‌ను మాత్రం ఓటీటీ వెర్షన్‌లో కూడా తొలగించినట్లు తెలుస్తోంది. 

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు..

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ నటన, దర్శకుడు బుచ్చిబాబు సన టేకింగ్, అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పుడు ‘పెద్ది’ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

కథేంటంటే?

విజ‌య‌నగ‌రానికి స‌మీపంలోని కొండ కింద ఊరికి చెందిన వ్యక్తి పెద్ది (రామ్ చరణ్). ఆ ఊరికి వెళ్లాలంటే కాలి నడకన కొండ‌లు, వాగులు దాటడం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు. పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నా ఆ ఊరికి పేరు, ఎలాంటి గుర్తింపు లేదు కనుక రైలు అక్కడ ఆగదు. అక్కడ ఎవ‌రికి ఓటు హ‌క్కు లేకపోవడంతో ప్రభుత్వం, రాజకీయ నేతలు వాళ్లను పట్టించుకోరు. విజయనగరం బెల్లం బట్టీలలో పని చేస్తూ వచ్చే అరాకొర కూలీతో అక్కడి వాళ్లంతా జీవనం సాగిస్తుంటారు. పెద్ది ఆ పనితో పాటు ఆట కూలీగా క్రికెట్ ఆడుతుంటాడు. ఏ ఊరి ప్రజలు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే ఆ ఊరి తరఫున క్రికెట్ ఆడుతూ, తనదైన ఆట తీరుతో ఆ ప్రాంతంలో చక్కని గుర్తింపు తెచ్చుకుంటాడు. 

►ALSO READ | Fauzi సెట్లో అసలేం జరిగింది?

అలాగే లోకల్ పొలిటీషియన్ (రావు రమేష్) కూతురు అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ను ప్రేమిస్తుంటాడు. ఆమె కారణంగా రామ్ బుజ్జి (దివ్యేందు శర్మ)తో గొడవ పడతాడు. దాంతో క్రికెట్ ఆటలో పెద్దిని అవమానించి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. మరోవైపు రైల్వే స్టేషన్ తోనే తమ ఊరికి గుర్తింపు వస్తుందని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అప్పలసూరి (జగపతి బాబు) చేసిన త్యాగం, తదనంతర పరిస్థితులు పెద్దిలో మార్పు తీసుకొస్తాయి. ఆ మార్పు ఏమిటి..? ఎంతో ఇష్ట‌మైన క్రికెట్‌ను వ‌దిలి గౌర్నాయుడు ( శివ రాజ్ కుమార్) దగ్గర కుస్తీ ఎందుకు నేర్చుకున్నాడు..? రెజ్లింగ్ లో  నేష‌న‌ల్స్ వ‌ర‌కు వెళ్లిన పెద్దికి ఎదురైన అడ్డంకులు ఏంటి..? కుస్తీ నుంచి మరో ఆటకు ఎందుకు మారాల్సి వచ్చింది..? అందుకోసం అతను చేసిన త్యాగం ఏమిటి.. తన ఊరికి గుర్తింపును, రైల్వే స్టేషన్‌ను ఎలా తీసుకు వచ్చాడు..? అనేది అసలు కథ.