సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో, వందమంది కొత్తవాళ్లను పరిచయం చేస్తూ అజర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొత్త సినిమా’. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన 'మేము కూడా సినిమా తీసినామురో..' అనే పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
మరో అతిథి మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్‌కు తగ్గట్టే కొత్తగా ఈ సినిమా తీశారు. ఫిల్మ్ మేకింగ్‌లోని అన్ని రూల్స్‌ను అజర్ బ్రేక్ చేశాడు. మేడ్ ఇన్ గోదావరిఖని అని తను ప్రూవ్ చేశాడు’ అన్నారు. వందమంది కొత్త వాళ్లను పరిచయం చేయడం మామూలు విషయం కాదని నటుడు ఆర్కే సాగర్ అభినందించారు.
తన కొడుకు అజర్ కలను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన హుస్సేన్ రియల్ హీరో అని ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ సాయిల్ అన్నారు. చిత్ర దర్శకుడు అజర్ మాట్లాడుతూ ‘‘మన ఊరిలోనే ఉంటూ మన ఊరివాళ్లతో సినిమా తీయొచ్చు అని ఈ చిత్రంతో ప్రూవ్ చేశా’ అని అన్నాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
