దొంగచాటు ప్రేమ.. తబాహీ.. యశ్‌ ‘టాక్సిక్’ నుంచి సాంగ్ రిలీజ్

దొంగచాటు ప్రేమ.. తబాహీ.. యశ్‌ ‘టాక్సిక్’ నుంచి సాంగ్ రిలీజ్

యశ్‌‌ హీరోగా నటిస్తున్న పాన్- ఇండియా మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్‌‌ దర్శకత్వం వహిస్తుండగా మాన్‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. బుధవారం ఈ చిత్రం నుంచి ‘తబాహి’ అనే పాటకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

యశ్‌‌, కియారా జంటపై చిత్రీకరించిన ఈ పాటలో ఇద్దరి ఆన్‌‌స్క్రీన్‌‌ కెమిస్ట్రీ సాంగ్‌‌కు మేజర్‌‌‌‌ హైలైట్‌‌గా నిలిచింది.  వీడియో విడుదలకు ముందు ‘దొంగచాటుగా మాత్రమే బతికే ప్రేమను ఏమంటారు..’ అంటూ సోషల్ మీడియాలో కియారాను ప్రశ్నిస్తూ ట్యాగ్ చేయగా, అందుకు ఆమె ‘తబాహీ’ అంటూ బదులిచ్చింది.

విశాల్ మిశ్రా కంపోజ్ చేయడంతో పాటు తనే పాడిన ఈ పాటకు తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.  నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ అవుతోంది.  ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.