రాష్ట్రంలోని సీపీగెట్-2026 ప్రవేశ పరీక్షలు షురూ

రాష్ట్రంలోని సీపీగెట్-2026  ప్రవేశ పరీక్షలు షురూ

హసన్ పర్తి,వెలుగు : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్ -2026 ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 8 నుంచి 15 వరకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ వైస్‌‌ఛాన్సలర్, చైర్మన్ కే.ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

మొదటి రోజు వివిధ కోర్సుల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మొత్తం 6,380 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కన్వీనర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. నేడు ఎం.ఏ. ఎకనామిక్స్, తెలుగు, ఎం.ఎస్‌‌సీ. డేటా సైన్స్, సైకాలజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.