సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి : జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా

సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి :  జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా

జనగామ, వెలుగు : పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడంతో పాటు ఇన్​కమ్ కూడా పెంచుకునే విధంగా ప్లానింగ్​ చేసుకోవాలని జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా సూచించారు. పంచాయతీల సమగ్రాభివృద్ధి కోసం మూడేండ్ల ప్లానింగ్ రూపొందించుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్​లో 'గ్రామ పంచాయతీ.. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక'పై పాలకుర్తి నియోయజకవర్గ సర్పంచ్​లు, సెక్రటరీలకు నిర్వహించిన ట్రైనింగ్ లో కలెక్టర్​ మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవలన్నారు. 

చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జీ రామ్ జీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 125 రోజుల పని దినాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో భాస్కర్, డీపీవో వెంకట్ రెడ్డి, ఈజేఎస్ పీడీ సూరి, సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.