కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల స్టేజి వద్ద స్కూల్ బస్సు, లారీని ఢీకొంది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న లారీని మోద్గులగూడెం నుంచి కురవి వెళ్తున్న నాగార్జున స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. రెగ్యులర్ డ్రైవర్ పక్కన ఉండగా, మరో వ్యక్తి స్కూల్ బస్ నడిపినట్లు పేరెంట్స్తెలిపారు. విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడడంతో పేరెంట్స్ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనా స్థలానికి కురవి, సీరోలు పోలీసులు చేరుకొని బస్ డ్రైవర్, స్కూల్ యాజమానిని స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరోలు ఎస్సై సంతోష్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ విజయ, ఎస్సైలు సతీశ్, సంతోష్, ఎంవీఐ వెంకట్ రెడ్డి ఉన్నారు.
