గంగాధర/రామడుగు, వెలుగు: చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని, అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లోని ప్రజా కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన చిరుత మంగ రమేశ్, రామడుగు మండలం షానగర్ సర్పంచ్గునుకొండ శైలజ- అశోక్ దంపతులు తమ అనుచరులతో కలిసి బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు మంత్రి మహేందర్, జవ్వాజి హరీశ్, సింగిల్ విండో చైర్మన్ వి.తిరుమల్‌రావు, సర్పంచ్అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
