అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బర్త్ డే వేడుకలు.. కరీంనగర్ లో కేక్ కట్ చేసిన యూత్ కాంగ్రెస్

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బర్త్ డే వేడుకలు.. కరీంనగర్ లో కేక్ కట్ చేసిన యూత్ కాంగ్రెస్

కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్  రెడ్డి బర్త్​డే వేడుకలు బుధవారం కరీంనగర్​లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ లో జిల్లా యూత్ కాంగ్రెస్  వైస్ ప్రెసిడెంట్ కిమ్ ఫహాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి  నరేందర్ రెడ్డికి తలపాగా, ఖడ్గాన్ని బహుకరించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌‌‌‌ కాంగ్రెస్ లీడర్ ఆకారపు భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు కళ్యాణి, నర్సింగం, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ సత్యప్రసన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.