కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకిన్‌పూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో హిందీ టీచర్ను నియమించాలని కోరుతూ పదో తరగతి విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాశారు. శుక్రవారం తపాలా దినోత్సవం సందర్భంగా తమ సమస్యను వివరిస్తూ పోస్టుకార్డులను పంపించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు హిందీ టీచర్ను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా టీచర్ లేకపోవడంతో చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. ఈ సమస్యపై మూడు నెలల కిందనే జగిత్యాల కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినా స్పందన లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి పాఠశాలలో హిందీ టీచర్ను నియమించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
