పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలో గుర్తించి చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రి ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ఆయన, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.

గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ వంద పడకల ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా మోకాళ్ల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీ-ఆర్మ్ మిషన్ అందుబాటులోకి రావడంతో చికిత్సలకు ఇబ్బందులు తొలగాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీవో కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలి..

నూతనంగా ఎన్నికైన వేములవాడ మండల ప్రాథమిక సంఘం చైర్మన్, పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో సహకార సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వకుళభరణం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పాలకవర్గ సభ్యులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.