ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు..

ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు..
  • మాల సంఘాల జేఏసీ నేత భాస్కర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల సంఘాల జేఏసీ నేత మాందాల భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు గౌడ్ లైన్స్ పాటించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవర్గీకరించిన గ్రూప్ వన్ లో 15 కులాలు, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 18 కులాలను చేర్చి మాలలకు కేవలం 5 శాతం రిజర్వేషన్ ఇచ్చి మోసం చేసిందన్నారు. 

ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన ఔట్ సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో మాలలకు రెండు పోస్టులు కూడా రాలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. రోస్టర్ విదానాన్ని కూడా సహేతుకంగా చేయలేదని విమర్శించారు. 

రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్ లీడర్ మాదాసు రాహుల్, జక్కుల యాదగిరి, నీరటి శ్రీనివాస్, మాందాల శ్రీనివాస్, ఎడ్ల సందీప్, మూల కిశోర్ పాల్గొన్నారు.