భారీ పతనం తర్వాత గోల్డ్ రివర్స్ గేర్.. హైదరాబాదులో గ్రాముకు ఎంత పెరిగిందంటే?

భారీ పతనం తర్వాత గోల్డ్ రివర్స్ గేర్.. హైదరాబాదులో గ్రాముకు ఎంత పెరిగిందంటే?

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ దాదాపుగా మెుదటికి వచ్చిన వేళ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. నిన్న ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు అల్లకల్లోలం సృష్టించాయి. ప్రస్తుతం ఆ ఆందోళనలు బులియన్ మార్కెట్లను కూడా తాకాయి. గడచిన మూడు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో వెండి కూడా భారీగానే ప్రభావితం అవుతోంది. షాపింగ్ చేయాలనుకునే తెలుగు ప్రజలు మాత్రం తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించటం బెటర్. 

జూలై 9న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.11 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 324గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 130గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 9, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పు లేకుండా రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.