హైదరాబాద్, వెలుగు:శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో, అమెరికా పెన్ స్టేట్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించిన ఏఐ ఆధారిత సెమీకండక్టర్, ఎనర్జీ ఎఫీషియెంట్ హార్డ్వేర్పై రెండు రోజుల అంతర్జాతీయ వర్క్షాప్ హైదరాబాద్లోని టీ–-హబ్లో బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి 350 మందికి పైగా విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు పాల్గొన్నారు.
సొసైటీ కార్యదర్శి ఆదిత్య బోధన, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో ఏఐ వినియోగాన్ని వివరించారు. చిప్ డిజైన్ రంగంలో భారతదేశానికి ఉన్న అవకాశాల గురించి తెలియజేశారు. పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాధవన్ నెక్స్ట్ జనరేషన్ సెమీకండక్టర్ వ్యవస్థలపై ప్రసంగించారు. టాటా ఎలక్ట్రానిక్స్, బెంగళూరు ఐఐఎస్సీ, హిటాచీ ప్రతినిధులు ఎడ్జ్ ఏఐ, వీఎల్ఎస్ఐ రూపకల్పన వంటి అంశాలపై చర్చించారు.
