హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌కు చెందిన డీప్-టెక్ రోబోటిక్స్ కంపెనీ బాట్ ఫ్యాక్టరీ భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత మురుగునీటి పాలన వ్యవస్థ ప్రాజెక్ట్ శుధ్‌ను టీ–-వర్క్స్ వేదికగా ప్రారంభించనుంది. ప్రమాదకరమైన మ్యాన్‌హోల్స్, మురుగు కాల్వలలోకి మనుషులు వెళ్లకుండా ఆపడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
ఈ ప్లాట్‌ఫారమ్ అటానమస్ క్లీనింగ్ రోబోలు, ఏఐ, జీఐఎస్ మ్యాపింగ్, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్‌ను కలుపుతుంది. ఈ రోబోటిక్ వ్యవస్థ ద్వారా మురుగునీటి నిర్వహణను డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. ఈ యంత్రం భూగర్భ మౌలిక వసతులను పర్యవేక్షించే ఒక సమగ్ర ఏఐ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్‌ఫారమ్ అని బాట్ఫ్యాక్టరీ తెలిపింది.
