నిజామాబాద్‌రూరల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్మండలంలో టాయ్లెట్క్లీనర్నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్‌ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే చంపేసినట్లు తెలుస్తోంది.
మోపాల్మండలం అమ్రాబాద్పంచాయతీ పరిధిలోని కొక్యానాయక్తండాకు చెందిన బానోత్హరి(50) దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్హరి నిత్యం మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. బుధవారం కూడా మద్యం తాగొచ్చిన హరి ఇంట్లో గొడవకు దిగడంతో కుటుంబసభ్యులే గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతుని సమీప బంధువు పవన్ ఇచ్చిన ఫిర్యాదు, ఘటనాస్థలానికి చేరుకొని ఆనవాళ్లు సేకరించారు. హరి గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి భార్య మీరాబాయి, కొడుకు సురేశ్, కోడలు రజిత, కోడలి తమ్ముడు వెంకటేశ్తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.
