ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ .. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఘటన

ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ ..    కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఘటన

బాన్సువాడ, వెలుగు : హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో బుధవారం జరిగింది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎస్. అమృత (17) బాన్సువాడ గర్ల్స్ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం ఉదయం తన తండ్రికి ఫోన్ చేసి.. జ్వరంగా ఉందని, హాస్టల్ కు రావాలని చెప్పడంతో తాను కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. 

కొద్ది సేపటి తర్వాత ఆమె తండ్రి హాస్టల్ కు వచ్చే చూసే సరికే అమృత గదిలో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూసే సరికే అమృత చనిపోయింది. హాస్టల్ వార్డెన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని, ఆమె ఒత్తిడి భరించలేకే అమృత ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ ఎస్ నాయకులు హాస్టల్ ఎదుట, అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు.