1200 ఓటర్లు దాటితే మరో పోలింగ్ స్టేషన్: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

1200 ఓటర్లు దాటితే మరో పోలింగ్ స్టేషన్: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని, ఒక కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1200 దాటినా, 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నా అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షిస్తూ రైతులు పంటల వైవిధ్యం వైపు మొగ్గు చూపాలని సూచించారు.

ఆ తర్వాత నూతన్ కల్ మండల పర్యటనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, భవన రిపేర్లకు  రూ. 10 లక్షలు మంజూరు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమై, భూభారతి చట్టం-2025 ద్వారా నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన 1,780 మంది రైతులకు పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు.