యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలు పేమెంట్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాదాద్రి జిల్లా జూలూరు పీఏసీఎస్ సెక్రటరీ ఆర్ నర్సింహపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు.
పెద్ద రావులపల్లి పీఏసీఎస్ సెంటర్లో వడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాకుండా ఇతరుల అకౌంట్లలో జమ చేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేయడంతో డిస్ట్రిక్ కో ఆపరేటీవ్ ఆఫీసర్ నాగార్జున విచారణ చేపట్టి పీఏసీఎస్ సెక్రటరీ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా సెక్రటరీ నర్సింహపై సస్పెన్షన్ వేటు పడింది.
