హైదరాబాద్, వెలుగు: పత్తిలో కలుపు నిర్వహణ కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ హిట్వీడ్ మాక్స్ పేరుతో గడ్డిమందును అందుబాటులోకి తెచ్చింది. దీనిని 2 నుంచి 3 ఆకుల దశలో ప్రతి పంపునకు 70 మిల్లీలీటర్ల చొప్పున వాడితే గడ్డి, వెడల్పాటి ఆకుల కలుపును సమర్థవంతంగా నివారిస్తుంది.
ఇది 25 నుంచి 30 రోజుల వరకు సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది. పంట తొలి దశలో కలుపు లేకుంటే దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రైతులకు ప్రోత్సాహకంగా కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.
భారతదేశ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దాదాపు 1/6 వంతు సహకారాన్ని అందిస్తుందని క్రాప్ కేర్ బిజినెస్ సీఈఓ రాజవేలు తెలిపారు. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల కలుపు సమస్యలు పెరుగుతాయని ఆయన అన్నారు.
