సర్ విధులను బహిష్కరించిన బీఎల్వోలు

సర్ విధులను బహిష్కరించిన బీఎల్వోలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఓటర్ల నమోదు, సవరణ (ఎస్‌‌‌‌ఐఆర్) సర్వే విధులను అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలు, ఆర్పీలు(బీఎల్వోలు) బహిష్కరించారు. మూడేళ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని బుధవారం కంటోన్మెంట్  బోర్డు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

బోర్డు అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. కష్టపడి విధులు నిర్వహిస్తున్నా తమకు మూడేండ్లుగా జీతాలు చెల్లించకపోవడం సరైంది కాదన్నారు.

ఒకవైపు వేతనాలు ఇవ్వకుండా సర్​ సర్వే బాధ్యతలను అప్పగించారని, సర్వేకు వెళ్లిన చోట సూపర్ వైజర్లు తమను చులకన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసికంగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనతో కంటోన్మెంట్  బోర్డు ఆఫీస్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది.