ఆఫ్రికాలో విస్తరణకు నాట్కో రెడీ.. రూ.2,500 కోట్ల పెట్టుబడి

ఆఫ్రికాలో విస్తరణకు నాట్కో రెడీ.. రూ.2,500 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఆఫ్రికాలో విస్తరించడానికి హైదరాబాద్​ఫార్మా కంపెనీ నాట్కో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఇందులో రూ.1,500 కోట్లను దక్షిణాఫ్రికా సబ్సిడరీకే కేటాయిస్తామని తెలిపింది. దక్షిణాఫ్రికాకు చెందిన అడ్​కాక్​ఇన్​గ్రామ్​లో వాటాను 35 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంటామని ప్రకటించింది.  

ఇన్​గ్రామ్‌కు చెందిన 1,96,18,825 షేర్లను రూ. 5.89 చొప్పున కొనుగోలు చేయనుంది.  ఇందుకోసం మొత్తం 1.8 బిలియన్ ​ర్యాండ్లు (రూ. 1,069 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రక్రియ అంతా ఈనెల చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. 1890లో దక్షిణాఫ్రికాలో ఏర్పాటైన అడ్‌కాక్ ఇన్​గ్రామ్..మందులు, వినియోగదారుల ఉత్పత్తులు, ఓటీసీ ప్రొడక్టులను తయారు చేస్తుంది.