న్యూఢిల్లీ:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోని డిపాజిట్లకు వడ్డీ చెల్లించడం మొదలుపెట్టింది. సభ్యులు జులై 15 నాటికి తమ ఖాతాల్లో అప్‌డేట్ అయిన మొత్తాన్ని ఆన్లైన్లో చూసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం తెలిపారు.
ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ రేటుతో 34 కోట్ల మంది సభ్యుల ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్ల వరకు జమ అవుతుంది.
ఎలక్ట్రానిక్ ఛానెల్స్ ద్వారా డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి.
పాక్షిక ఉపసంహరణల విభాగాలను 13 నుంచి మూడుకు తగ్గించారు. సభ్యులు గరిష్టంగా 75 శాతం బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. వేరే ఉద్యోగానికి మారితే పీఎఫ్ ఖాతాల బదిలీ ఆటోమేటిక్గా జరుగుతుందని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ తెలిపింది.
