దాదా- ది సౌర‌‌వ్ గంగూలీ స్టోరీ.. 2027 మే 14న సినిమా రిలీజ్

దాదా- ది సౌర‌‌వ్ గంగూలీ స్టోరీ.. 2027 మే 14న సినిమా రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ చిత్రం రూపొందుతోంది. గంగూలీ పాత్రను రాజ్ కుమార్ రావు పోషిస్తున్నాడు. గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. రాజ్ కుమార్ రావు ఈ పోస్టర్‌‌‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌‌ చేస్తూ గంగూలీకి బర్త్ డే విషెస్‌‌ చెప్పారు.

2002లో ఇంగ్లాండ్‌‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ విప్పి గాలిలో చూపుతూ సెలబ్రేట్‌‌ చేసుకున్న ఐకానిక్ మూమెంట్‌‌ను ఈ ఫస్ట్ లుక్‌‌లో రీక్రియేట్‌‌ చేశారు. విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది మే 14న సినిమాను విడుదలత చేయనున్నట్టు ప్రకటించారు.